భౌగోళిక స్వస్థతా ప్రార్థనలు


“ధ్యానము చేయునది కాదు, జరుగునది”

Meditations and Rituals | Prayers and Invocations
The World Health & Healing Order, PDF (130 KB) | PDF English-Telugu
Prayer (MP3, 18 MB) | Video as visualization aid (MP4, 40 MB)
Prayer on YouTube

  • ప్రపంచ వ్యాప్తముగా విస్తరించి కొనసాగుతున్న కరోనా వ్యాధి దృష్ట్యా, దాని ప్రభావమున ప్రబలుతున్న అనేక అనారోగ్యములకు నివారణగా వరల్డ్ హెల్త్ అండ్ హీలింగ్ ఆర్డర్ అనునది అనుగ్రహింపబడినది.
  • ఈ వ్యాధి పై దాడి చేసి నిర్మూలించ యత్నించటం నిరర్థకం. వ్యాధి నిరోధమునకు గానీ పూర్ణ స్వస్థతకు గానీ అది ప్రయోజనకరము కాజాలక ప్రతిస్పందన క్రియగానే మిగులుతుంది. పరమగురువుల నుండి వర్షించు ప్రేమ, కరుణలు మాత్రమే వ్యాధి యొక్క నిరంతర శక్తులను కరగించగలవు. నిర్మలమైన ప్రేమ తత్వము అన్నిటినీ జయిస్తుంది.
  • జగద్గురుపీఠం బృందమువారు లేదా ఇతర ఆధ్యాత్మిక బృందములలో సేవాదృక్పథము కలిగిన ఔత్సాహికులు ఈ సత్కార్యములో, సత్సంకల్పములో భాగస్వామి కావచ్చును. దీనికి కావలసినది ఒక స్నేహితుడిని / స్నేహితురాలిని ( బంధువు గాని, తెలిసిన వారు గాని) ఎంచుకొని మాస్టరు పార్వతీ కుమార్ గారితో ( మానసికముగా) ఒక త్రిభుజముగా ఏర్పడడమే. జగద్గురుపీఠం ఆశయసాధనకు కృషిచేస్తున్నవారు ప్రపంచవ్యాప్తముగా ఉన్నందున, అటువంటి త్రిభుజములు భౌగోళికముగా కార్యరూపం దాల్చుటకు ఎంతో అవకాశమున్నది.
  • ఈ హీలింగ్ ప్రక్రియ అతి సులభం. దీనికి చేయవలసినదల్లా మీరు మరియు మీ స్నేహితుడు/స్నేహితురాలు/ బంధువు భౌతికంగా ఉన్న చోటు నుండి, మానసికముగా నాతో ( మాస్టరు కె.పి.కె) కూర్చున్నట్లు భావించి ఒక త్రిభుజాన్ని నిర్మించి ఈ మహమ్మారి మరియు ఇతర వ్యాధుల నుండి ప్రపంచాన్ని నయం చేయడానికి, మానవాళికి సేవ చేయడానికి ధృఢ సంకల్పం చేయడమే .
  • ఈ త్రిభుజముగా ఏర్పడిన సభ్యులు ప్రతి గురువారం మరియు ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు (స్థానిక సమయం), ఈ క్రింద సూచింపబడిన చిన్ని ప్రార్థన తో పరిసరాలకు శక్తిని ప్రసారం చేయవలయును.

ప్రార్థన:
ఓంకారము 3 సార్లు ఉచ్చరించాలి
1మాస్టర్ నమస్కారం
మాస్టర్ సి.వి.వి నమస్కారం
మాస్టర్ ఎం.ఎన్. నమస్కారం
మాస్టర్ ఇ.కె. నమస్కారం
మాస్టర్ కే.పి.కే నమస్కారం
మాస్టర్ నమస్కారం
5 నిమిషములు మౌనం. తరువాత ఈ క్రింది మంత్రమును ఉచ్చరించవలెను
2“మాస్టర్ ! వ్యాధిని, క్షీణతను, మృత్యువును  నిరోధించుటకు – నిర్మలమైన ప్రేమను, పరమ సత్యమును, పరమానందమయమగు అస్థిత్వమును  గుర్తెరుగుటకు, మీ ప్రణాళిక ననుసరించి మానవాళికి సేవ చేయుటకు – మీ అనంత ప్రాణశక్తి ప్రవాహమును – మా దేహ వ్యవస్థ లోనికి ప్రవేశింపజేతురు గాక! మాస్టర్ నమస్కారం!”
2 నిమిషముల పాటు మౌనము
3నేను, నా మిత్రునితో కలిసి 7 నిమిషముల పాటు మాస్టర్ చైతన్యమును మాస్టర్ కే.పి.కే ద్వారా ఆజ్ఞా కేంద్రము మీదుగా మా అనాహత కేంద్రమునకు దిగి, త్రిభుజము లోనికి దిగివచ్చుటను దర్శించు చున్నాను.
7 నిమిషముల పాటు మౌనము
4మేము మా హృదయగహ్వరములో  హిరణ్య వర్ణమును సమృధ్ధిగా అనుభూతి చెందుచున్నాము.
3 నిమిషముల పాటు మౌనము
5స్వస్థతా చైతన్య ప్రవాహమును అనాహత కేంద్రము నుండి వెలువడి మా విశుద్ధి కేంద్రమునకు, బాహువులకు, చేతులకు, అరచేతుల నుండి పరిసరమునకు విడుదలగుట దర్శించు చున్నాము.
12 నిమిషముల పాటు మౌనము
6స్వస్థతా చైతన్య ప్రవాహము క్రమ క్రమముగా తరంగములుగా మా పరిసరములను, మా ప్రాంతమును, మా రాష్ట్రమును, మా దేశమును, మా ఖండమును, యావత్ భూగోళమును కుడా ఆవరించు చుండుట ను దర్శించు చున్నాము .
3 నిమిషముల పాటు మౌనము
7ఓం శాంతి శాంతి శాంతిః

గమనిక

  • ఈ విధమైన ప్రార్థన ప్రతి త్రిభుజము ద్వారా వారమునకు రెండుసార్లు నిర్వర్తింపబడుట వలన శక్తి ప్రసారము జరిగి, ప్రేమ, కరుణలతో వ్యాధి యొక్క తీవ్రత తగ్గించబడి, వ్యాధుల నుండి ఉపశమనము లభించును.
  • ఈ మానవ ప్రయత్నం తక్షణ అవసరంగా పరిగణించబడుతున్నది. ఆసక్తి గల సోదరులందరూ ఇంతటి మహోన్నతమైన సేవా కార్యములో పాల్గొని వరల్డ్ హెల్త్ అండ్ హీలింగ్ ఆర్డర్ (WHHO) లో సభ్యత్వం పొందగలరు.
  • ఈ ఉత్కృష్టమైన సేవ 2020 డిసెంబర్ 31 న పౌర్ణమి, గురువారం నుండి ప్రారంభమయి ఆజన్మాంతమూ కొనసాగుతుంది. దయచేసి గురువారం మరియు ఆదివారం స్థానిక సమయం మధ్యాహ్నం 12 గంటలను ఈ సత్కార్యమునకై కేటాయించుకొనవలసి యున్నది.
  • 2020 డిసెంబర్ 31 తర్వాత కూడా సభ్యులు ఈ స్వస్థతా ప్రార్థనలలో  చేర వచ్చును .
  • ఈ సేవలో చేరిన వ్యక్తులు ఈ-మెయిల్ ద్వారా వారి సంసిద్ధతను నాకు తెలియజేయవచ్చును. ఈ ప్రయోజనం కోసం ప్రత్యేకంగా kparvathikumar@gmail.com అను ఖాతా రూపొందించబడింది. దయచేసి మీ పేరు & చిరునామా మరియు త్రిభుజముగా మీతో చేరాలనుకునే మీ స్నేహితుడి/బంధువు పేరు & చిరునామా మరియు ఫోను నంబరును, మీ స్నేహితుడికి ఒక కాపీ ప్రతితో నాకు ఈ-మెయిల్ ద్వారా తెలియజేయండి. ఈ ప్రయోజనం కొఱకు మీరు ఒక్క స్నేహితుడి/ బంధువు తో మాత్రమే జట్టు కట్టగలరు. అతడు మీతో కాక మరెవరితోనూ త్రిభుజముగా ఏర్పడకుండునట్లు పేరు సూచించే సమయమునందే నిశ్చయించుకొనగలరు. మీ ఇరువురి తరఫున ఒక ఇ-మెయిల్ మాత్రమే పంపగలరు.
  • మాస్టరుగారు ప్రాతిపదికగా సేవాదృక్పథముతో బాధ్యతను నిర్వర్తింతుము గాక.

కె పార్వతీ కుమార్

WHHO ఊహా చిత్రము